Monday, 14 July 2025

sri bhagavad gita saramsam:గీత సారాంశం



నువ్వు ఏమి పోగొట్టుకున్నావు అని అంతలా దుముఖిస్తున్నావు ? 


  • గతమంతా మంచే జరిగింది. 
  • వర్తమానం కూడా మంచే జరుగుతుంది. 
  • భవిష్యత్తు కూడా మంచే జరుగుతుంది. 


  • నువ్వు పోగొట్టు కొన్న దానిని నువ్వు సృష్టించలేదు. నువ్వు అనుభవిస్తున్నదంతా ఇహలోక సంపదే. 
  • నువ్వు అనుభవించే ఈ భోగం నిన్న వేరొకరి సొత్తు. నేడు నిధిగా అయిన్ది. రేపు వేరొకరి స్వంతం అవుతుంది. 
  • మార్పు అనేది ప్రకృతి సహజధర్మము . 

  • భగవద్గిత గురించి ఎన్నో వ్యాఖ్యానాలున్నాయి ఎందరో పండితులు, సామాన్యులు, ఔత్సాహకులు కూడా అర్దాలు, అంతరార్దలు, సందేశాలు, విశేషాలు వివరించారు. కనుక భగవద్గిత సారం అన్న విషయం ఇది వ్రాసేవారికి అర్ధమయినంత, తోచినంత అని గ్రహించాలి. 

  • కర్తవ్య విమూఢడైన అర్జునుడికి జ్ఞానం బోధించి, కర్తవ్యం వైపు నడిపించడం అనేది గీత లక్ష్యం అని సందర్భానుసారంగా అనుకోవచ్చు. అయితే అర్జునుడు ఒక పట్టాన ఈ విషయాన్ని అంగీకరించక  ప్రశ్నిస్తూ ఉంటాడు. శిష్యుని పై వాత్సల్యంతో శ్రీ కృష్ణుడు అతనికి నిగూఢమైన, వేరేవారికి తెలియని అనేక విషయాలు బోధిస్తాడు.  


  • ఆత్మ నిత్యా సత్యమైనది, చావు లేనిది. మృత్యువు వారిని శరీరాల నుండి వేరుచేస్తుందే కానీ ఆత్మను చంపదు . సత్యమైన జ్ఞానము ఆత్మ జ్ఞానమే అంటే తనను తానూ తెలుసుకోవడమే, తనలోని అంతరాత్మ గురించి తెలుసుకోవడమే. ఆబ్యాస వైరాగ్యముల ద్వారా యోగీ , వాస్తు ప్రపంచాన్ని వదిలి సర్వోత్క్రష్టమైన పరబ్రహ్మణ్ణి చేరగలడు. భక్తి , కర్మ,ధ్యాన, జ్ఞాన మార్గాలలో భగంతుని చేరవచ్చును. 

  • మనిషి కర్మ చేయకుండా ఉండడం సాధ్యం కాదు. అయితే కర్మలవలన దోషాలు కూడా తప్పవు. సత్పురుషుల ద్వారా జ్ఞానాన్ని సంపాందించి, సత్కర్మలు ఆచరించాలి. కర్మలపై ప్రతి ఫలాన్ని ఆశించరాదు. అన్ని కర్మల ఫలాన్ని భగవంతునకు ధారపోయాలి. 

  • కృష్ణుడే పరబ్రహ్మము. సృష్టిలోని సకలము భావంతుని అంశంతోనే ఉన్నాయ్. అన్ని పూజల, యజ్ఞాల ఫలాలు ఆ దేవదేవునికి చెందుతాయి. బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవడానికి శ్రీ కృష్ణుడు అర్జునునకు తాత్కాలికముగా దివ్య దృష్టిని ప్రసిందించాడు. అనంతం, తోజోమయము, సర్వవ్యాప్తము, కాల స్వరూపము అయినా ఆ శ్రీ కృష్ణుని విశ్వ రూపాన్ని చూసి అర్జునుడు తరించాడు. 

  • ప్రకృతిలో సకల జీవాలు సత్వరజస్టమేగున్నాలచే నిండి ఉన్నాయ్. భగవంతునకు శరణాగతుడైనవాడికి ఈ గుణాలు బంధంనుండి విముక్తి లభిస్తుంది. 




No comments:

Post a Comment