Thursday, 17 July 2025

sri krishna god biography: శ్రీ కృష్ణుని గురుంచి ఆసక్తికరమైన విషయాలు గురుంచి చాల మందికి తెలియని విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.



🎕    శ్రీ కృష్ణుడు 5,252 సంవత్సరాల క్రితం జన్మించారు. 

🎕    శ్రీ కృష్ణుడు పుట్టిన తేదీ 21-07-3228

🎕    మాసం : శ్రవణం 

🎕    తిధి :    అష్టమి 

🎕    నక్షత్రం :    రోహిణి 

🎕    వారం :    బుధవారం 

🎕    శ్రీ కృష్ణుని జీవితకాలం : 125 సంవత్సరాల ఎనిమిది నెలల ఏడు రోజులు 

🎕    శ్రీ కృష్ణుని మరణము : 18-02-3102

🎕    శ్రీ కృష్ణుని 89 వ యేటా కురుక్షేత్రం జరిగినది 

🎕    శ్రీ కృష్ణుడు కురుక్షేత్రం జరిగిన 36 సంవత్సరాలు తరువాత శ్రీ కృష్ణుడు మరణించెను 

🎕    కురుక్షేత్రం 8-12-3139 మృగశిర శుక్ల ఏకాదశి నాడు ప్రారంభమై 25-12-3139 రోజున ముగిసింది.         21-12-3139 న సుమారు 3 గంటల నుండి 5 గంటల వరకు సంభవించిన సూర్య గ్రహణం                    జయద్రదుని మరణానికి కారణమైయెను. 

🎕    భీష్ముడు 2-2-3138 న ఉత్తరాయణంలో మొదటి ఏకాదశి నాడు ప్రాణము విడిచెను. 


శ్రీ కృష్ణుని కుటుంబము:

🎕    శ్రీ కృష్ణునికి జన్మనించిన తండ్రి పేరు వసుదేవుడు 

🎕    శ్రీ కృష్ణునికి జన్మనించిన తల్లి దేవకీ 

🎕    శ్రీ కృషునిని పెంచిన తండ్రి నందుడు 

🎕    శ్రీ కృష్ణుని పెంచిన తల్లి యశోద 

🎕    శ్రీ కృష్ణుని సోదరుడు బలరాముడు 

🎕    శ్రీ కృష్ణుని సోదరి సుభద్ర 

🎕    శ్రీ కృష్ణుని జన్మస్దలము మధుర 

🎕    శ్రీ కృష్ణుని భార్యలు : రుక్మిణి, సత్యభామ, జాంబవతి, కాళిందీ, మిత్రమింద, నగ్నజితి, భద్ర,లక్ష్మణ 

🎕    శ్రీ కృష్ణుడు జీవితంలో కేవలం నలుగురిని మాత్రమే హతమార్చినట్టు సమాచారం వారు            ఎవరంటే. 

🎕    చణురా - కుస్తీదార 

🎕    కంసుడు -   మేనమామ 

🎕    శిశుపాలుడు మరియు దంతవక్ర - అత్త  కొడుకులు 

🎕    హిందూ మతంలో ముక్కోటి దేవతలున్నారు వారిలో అత్యంత ప్రసిది గాంచిన దేవుడైన             శ్రీ  కృషుని గురుంచి మనలో అనేక మందికి తెలుసు. అయినా శ్రీ కృషునిని జీవితంలో            మర్మంతో కూడుకున్నది. ఎంత తెలుసుకున్న ఇంకా మిగిలే ఉంటుంది. కొందరికైతే శ్రీ             కృష్ణుని గురుంచి తెలుసుకోవటం, ఇంకా విశ్వం గురించి తెలుసుకోవటం ఒకటే అని                భవిస్తూఉంటారు. 

   🎕    ఈ విశ్వమంతా శ్రీ కృష్ణుని నోటనే ఉన్నది. 

🎕    శిశువుగా శ్రీ కృష్ణుడు ఒక అల్లరి పిల్లవాడు. చిన్నతనంలో ఆటను తన ఆనందం కోసం                     చేయదగిన అన్ని అల్లరి పనులు చేసారు కానీ, తన ప్రతి అల్లరి పనిలోనూ స్వలాభాషేక్ష                 లేని ప్రయోజనాలను చూపేవాడు. తన అమాయకత్వముతో చేసిన చిలిపి పనులుగా                         తోచినప్పటికీ, వాటి వెనుక గల అంతరార్థం, పరమాత్ముని లీలలను ప్రదర్శించేవిలా                         ఉండేవి. క్రమంగా తన తల్లికి, తన నోటిలోనే విశ్వాన్ని చూపించి అబ్బురపరచాడు శ్రీ కృష్ణ              భగవానుడు.

🎕    శ్రీ కృష్ణ భగవానుడు ఇంటి వెలుపల ఆడుతున్న సమయంలో అతని అన్న బలరాముడు        తల్లి యశోద కడకు వచ్చి శ్రీ కృషుడు మట్టి తింటున్నాడని ఫిర్యాదు చేసాడు. మొదట్లో        యశోద నమ్మని కారణంగా అతని నోటిని తెరిచి పరీక్షింపవలసినిదిగా బలరాముడు                సూచించగా యశోద కోపముతో శ్రీ కృష్ణుని ఇంటిలోనికి తీసుకుని వెళ్లి, నోటిని                            పరీక్షింపదలచినది. క్రమంగా నోరు తెరిచినా శ్రీ కృష్ణుని నోట మొత్తం విశ్వమే కాపాడగ,            ఆశ్చర్యానికి లోనైనా యశోద దేవి, దైవాంశ సంభూతునిగా మరియు దేవుని అవతారముగా        గ్రహించింది. కానీ తాను దేవుని అవతారంగా భావించిన యశోద దేవి తల్లిగా ఇక మీదట            ఉండలేదని గ్రహించిన శ్రీ కృష్ణుడు, తన దైవ శక్తితో యశోద దేవి జ్ఞాపకాల నుండి ఈ                సంఘటనని తొలగించివేశాడని చెప్పబడింది. 


🎕    శ్రీ కృష్ణ భగవానుడు, అతని భార్యలు మరియు నారద మునింద్రులు:

       

  • శ్రీ కృష్ణునికి 16108 భార్యలు ఉన్నారని మనకు తెలుసు. అష్టభార్యలు అని పిలవబడే ఎనిమిది మంది రాణులు వారిలో బాగా ప్రసిద్ధి చెందారు. రుక్మిణి కృష్ణునికి మొదటి రాణి.. రుక్మిణి తండ్రి ఆమెకు బలవంతంగా వేరే రాజుకి ఇచ్చి వివాహం చేయాలనీ సంకల్పిస్తాడు. కానీ ఆమె కృషుడిని ప్రేమించిన కారణం ఆ వివాహం నుండి ఆమెను రక్షించి తనతో తీసుకుని వెళ్ళిపోతాడు. శ్రీ కృషుడు అడ్డు వచ్చిన రుక్మిణి అన్న రుక్మిణి ని ఓడించి సగం శిరోముండనం గావించి చంపకుండా వదిలి పెట్టాడని కధనం. నారదముని ద్వారకలో శ్రీ శ్రీ  శ్రీ  కృష్ణుని సందర్శించడానికి వచ్చినప్పుడు శ్రీ కృష్ణుని మహిమలను తెలుసుకునే క్రమంలో భాగంగా తన భార్యలలో ఒకరిని బహుమతిగా ఇవ్వమని శ్రీ కృష్ణుని అడుగుతాడు. క్రమంగా శ్రీ కృష్ణుడు తన భార్యలలో ఎవరు ఒంటరిగా కనిపించిన ఆటను వారిని తన వెంట తీసుకెళ్ళవచ్చును అని షరతు విధించాడు. క్రమంగా శోధించిన నారద మునింద్రుల వారికి ఎ భార్య కూడా ఒంటరిగా కనపడలేదు. అన్నిటా శ్రీ కృష్ణుడె కొలువుతీరి ఉన్నారు. శ్రీ కృష్ణుని లీలగా గ్రహించిన నారద మునింద్రులు, తప్పును క్షమించమని శ్రీ కృష్ణుని వేడుకున్నారు. 

 

           గాంధారి శాపం :

  • మహా భారత యుద్ధం సమయములో శ్రీ కృష్ణ భగవానుడు గాంధారిని ఓదార్చటానికి వెళ్లినప్పుడు తన వంశం మొత్తాన్ని నాశనం చేస్తున్నట్లుగా శ్రీ కృష్ణుని నిందించి, నేటి నుండి ముప్పై ఆరు సంవత్సరాల తరువాత యాదవ వంశం పూర్తిగా నశిస్తుంది. అని శాపమిచ్చింది. ఆలా శ్రీ కృష్ణుడు యుద్దాన్ని అపి తన బిడ్డలా ప్రాణాలు కాపాడడంలో సహాయం చేస్తాడని భావించింది. కానీ ఆలా జరగలేదు. కౌరవ వంశమే తుడిచిపెట్టుకుని పోయింది. అయితే శ్రీ కృష్ణుడు ఆ శాపానికి సమాధానముగా తధాస్తు అని బదులిచ్చినాడు. అనగా ఈ లోకంలో పూర్తిగా పాపలతో నిండిపోయింది, కావున యుగాంతం జరుగక తప్పదు అని శ్రీ కృష్ణుని ఉద్దేశ్యం. 

         శ్రీ కృష్ణ భగవానుడు ఇంకా శిశుపాలుడు 

  •  శిశుపాలుడు ఒక సుప్రసిద్దమైన మరియు చేదు లక్షణాలు కలిగిన రాజుగా పేరు పొందిన వానిగా ఉన్నాడు. శిశుపాలుని 100 తప్పులు వరకు అతనిని చంపను అని, శిశుపాలుని తల్లికి శ్రీ కృష్ణుడు మాట ఇచ్చిన కారణముగా అతనిని వంద తప్పుల వరకు క్షమించడం జరిగింది. కానీ ఒక సమావేశములో శ్రీ కృష్ణుని పరిపరి విధాలుగా నిందించడం మొదలుపెట్టాడు. శిశుపాలుడు. ప్రతి ఒక నిందను తప్పుగా లెక్కిస్తూ వచ్చిన శ్రీ కృష్ణుడు, 100 తప్పులు పూర్తికాగానే తన సుదర్శన చక్రం తో శిశుపాలుని తలా నరికి వధించాడు. శిశుపాలుడు జరాసంధుడు నిజానికి పూర్వ జన్మలో జయ విజయాలనే విష్ణుని ద్వారపాలకులు. శాపవశాత్తూ మంచి వాళ్ళుగా మూడువందల సంవత్సరాలు విష్ణువుకి దూరంగా ఉండలేని వీరు, కృతయుగములో హిరణ్య కశిపుడు - హిరణ్యాక్షడు,త్రేతాయుగములో రవాణా - కుంభకర్ణులు, ఇంకా ద్వాపర యుగములో శిశుపాల - జరాసంధులుగా అవతరమెత్తి త్వరగానే విష్ణుమూర్తి అవతారాల చేతులలోనే సంహరించబడి విశుంవు వద్దకు చేరారని పురాణాల కధనం. 

        శ్రీ కృష్ణుడు ఇంకా ద్రౌపది :

  • మహాభారతంలో అన్న చెల్లెళ్ళ ప్రేమకు నిదర్శనంగా శ్రీ కృష్ణుడు - ద్రౌపదిలను అభివర్ణించబడినది. ద్రౌపది పార్వతీదేవి అంశంగా శ్రీ కృష్ణుడు  విష్ణుమూర్తి అంశంగా చెప్పబడింది. ఇక్కడ విష్ణువు - పార్వతి దేవిలను అన్న చెళ్ళళ్ళుగా పురాణాలలో చెప్పబడింది. 


        ఏకలవ్యునికి శ్రీ కృష్ణుని దీవెనలు: 

  • ద్రోణాచార్యానికి ఏకలవ్యుడు తన బొటనవేలికి అర్పించినప్పుడు, శ్రీ కృష్ణుడు ఏకలవ్యునికి ఒక వరమిచ్చినట్లుగా ప్రతీతి. క్రమంగా యజ్ఞం నుండి పుట్టిన దృస్టడీమ్నుడి చేత ద్రోణాచార్యుడు వధించబడ్డాడు. కానీ, మహాభారత యుద్దములో కర్ణుడు, ఏకలవ్యుడు చెల్లెలని పరిణయమాడిన కారణం ఏకలవ్యుడు కౌరవ సైన్యం వైపు ఉండవలసి వచ్చిందని కధనం.  





No comments:

Post a Comment